ఏపీ సీఎం జగన్‌ దంపతులకు కరోనా వ్యాక్సిన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ అనంతరం అరగంట పాటు సీఎం దంపతులిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. కమ్యూనిటీ హాల్‌లో ఆయన స్వయంగా వ్యాక్సిన్‌ వేయించుకుని.. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. ఆ తర్వాత గుంటూరు నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.