అంబర్‌పేటలో పేలిన యాసిడ్‌ రియాక్టర్

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో భారీ ప్రమాదం తప్పింది. అంబర్‌పేట పరిధిలోని గోల్నాక మారుతీనగర్‌లో ఉన్న ఓ యాసిడ్‌ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున రియాక్టర్‌ పేలింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. రియాక్టర్‌ పేలడంతో పరిసర బస్తీల్లో యాసిడ్‌ ప్రవహించింది. దీంతో ఘాటు వాసనతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు దానిని సీజ్‌చేశారు. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదుచేశారు. కాగా, యాసిడ్‌ కంపెనీ గత 15 ఏండ్ల నుంచి అక్కడ ఉందని స్థానికులు వెల్లడించారు. ఇన్నాళ్లుగా లైసెన్స్‌ లేకుండా కంపెనీని ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు.