ఈ నెల 22న ఏపీ కేబినెట్‌ సమావేశం

సీఎం జగన్‌ అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి భవనంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. కేబినెట్‌లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన మెమోరాండమ్‌లను 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా సాధారణ పరిపాలనశాఖ కేబినెట్‌ విభాగానికి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం అన్ని శాఖలను ఆదేశించారు.