ఈ నెల 10న జాతీయ లోక్‌ అదాలత్

ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్‌, కాంపౌండబుల్‌ క్రిమినల్‌ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణ. ఎటువంటి ఖర్చు లేదా ఫీజు లేకుండా లోక్‌ అదాలత్‌ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సమస్య పరిష్కారం లోక్‌ అదాలత్‌లో జరిగితే పెండింగ్‌ కేసుల్లో చెల్లించిన కోర్టు రుసుము కూడి తిరిగి ఇవ్వబడుతుంది.

పెండింగ్‌లో ఉన్న కేసులను లేదా ప్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులందరూ జిల్లా న్యాయ సేవల అథారిటీ చైర్మన్‌/సెక్రటరీ, ఆయా జిల్లాల జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని న్యాయ సేవా సదన్‌ లేదా సమీప మండల న్యాయ సేవల కమిటీ, సమీప న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు.