ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఖమ్మం, వరంగల్‌ పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఫుల్‌ అడిషనల్‌ ఛార్జీ తీసుకున్న పి. ప్రమోద్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. అదేవిధంగా ఖమ్మం పోలీసు కమిషనర్‌గా ఉన్న ఇక్బాల్‌ను బదిలీ చేసింది.

హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు తరుణ్‌ జోషిని బదిలీ చేస్తూ వరంగల్‌ కమిషనర్‌గా, ఆదిలాబాద్‌ ఎస్పీగా ఉన్న విష్ణు వారియర్‌ను బదిలీ చేస్తూ ఖమ్మం పోలీసు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.