గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్ర‌స్మా అధ్య‌క్షుడు

త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లా ట్ర‌స్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్య‌క్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైత‌న్య విద్యానికేత‌న్ హైస్కూల్ ఆవ‌ర‌ణ‌లో ఆయ‌న మూడు మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆనంద్‌రావు భార్య‌, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ స‌భ్యురాలు సుమిత్రానంద్‌, కుమార్తె మ‌హ‌తి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆనంద్‌రావు మాట్లాడుతూ.. ఇళ్ల‌లో జ‌రుపుకునే వివిధ ర‌కాల వేడుక‌ల్లో క‌నీసం ఒక్క మొక్క‌నైనా జ్ఞాప‌కంగా నాటాల్సిందిగా అది ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో మేలు చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.