రేపు సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

రేపు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయకూడదని అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ద్వారా కూడా ప్రచారం చేయకూడదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.