క‌రోనా హెల్ప్ లైన్ నంబ‌ర్లు.. ఎమ్మెల్సీ క‌విత ట్వీట్

క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ప్ర‌త్యేక హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసిన‌ట్లు ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ చేశారు.

హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ద్వారా కరోనా విషయంలో ప్రజలకు సహాయసహకారాలు అందిస్తామ‌న్నారు. ప్రజల నుండి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్ లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్ల ఏర్పాటు చేశామ‌ని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.