అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్న అటవీశాఖ అధికారులు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కర్జెల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న కలపను సోమవారం అటవీ అధికారులు పట్టుకున్నారు.
తెల్లవారుజామున బారెగూడ గ్రామం మీదుగా అక్రమంగా కలప తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో గ్రామశివారులో నిఘాపెట్టి కలపను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ రూ. 84 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.
స్మగ్లర్లు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.