నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ రంగనాథ్ స‌మీక్ష

న‌ల్ల‌గొండ జిల్లాలోని ‌నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్ర‌వారం పోలీసు సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పోలింగ్ సంద‌ర్భంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను సిబ్బందికి వివ‌రించారు. ఈ స‌మావేశంలో అద‌న‌పు ఎస్పీ న‌ర్మ‌ద‌, ఇత‌ర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నెల రోజుల‌కుపైగా హోరెత్తిన నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి నిన్న సాయంత్రం తెర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.