తెలంగాణ బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని వ్యైదులు పేర్కొన్నారు.