తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు కరోనా సోకింది. యాంటీజెన్ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారాయన. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉ‍న్నాయని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన సాగర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కాగా, నోముల భగత్‌కు, ఆయన కుటుంబానికి కూడా  కరోనా సోకిన సంగతి విధితమే.