క‌రోనాతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమ‌ర్‌నాథ్ మృతి

 తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. క‌రోనాతో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు అమ‌ర్‌నాథ్ మృతి చెందారు. గ‌త ప‌ది రోజుల క్రితం అమ‌ర్‌నాథ్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న నిమ్స్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. జ‌ర్న‌లిస్టు అమ‌ర్‌నాథ్ మృతిప‌ట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.