పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలి: మంత్రి హరీష్‌

బండ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి హరీష్‌రావు

పుల్లూరు బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పుల్లూరు గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయం భూ లక్ష్మి నృసింహస్వామి జాతర ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు జరుగును. పల్లె జాతరకు తలమానికంగా ప్రసిద్ధి చెందిన పుల్లూరు బండ జాతర పోస్టర్‌ను సిద్ధిపేటలోని తన నివాసంలో మంత్రి హరీష్‌రావు సోమవారం ఆవిష్కరించారు. జాతరకు రావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బండ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జాతరకు వచ్చే పర్యాటకులకు అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. త్రాగునీరు, రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కలకుంట్ల రంగాచారి, సర్పంచ్‌ నరేష్‌ గౌడ్‌, వంశపారంపర్య అర్చకులు రామకృష్ణమాచార్యులు, ఉప సర్పంచ్‌ ప్రసాద్‌, కో ఆప్షన్‌ సభ్యులు నర్సింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌, వెంకట్‌, ప్రదీప్‌ రావు తదితరులు పాల్గొన్నారు.