తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తాజాగా 2,251 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. మరో వైపు యాక్టివ్‌ కేసులు 50వేలకు చేరువయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1, 02,335 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 989, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్‌లో 367, మహబూబ్‌నగర్‌లో 258 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.