సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కూడా జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డే పదవికాలం ముగియడంతో తదుపరి సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.