కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు (87) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరారు. చికిత్స పొం‍దుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆయనకు వైద్యం అందించిన వైద్యులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం.​ ఆయన మృతితో వెదిర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.