ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 11,434 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ 64 మంది మృతి చెందారు. అలాగే 74,435 శాంపుల్స్ ను సేకరించారు. 7055 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. విజయనగరంలో 8 మంది, అనంతపురంలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, కర్నూలులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఇద్దరు కరోనా వైరస్‌తో మృతి చెందారు.
