ఏపీలో ఒక్కరోజే 14, 792 కరోనా పాజిటివ్ కేసులు.. 57 మంది మృతి

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా14,792 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. వైర‌స్ బారిన‌పడిన వారిలో 8,188 మంది కోలుకున్నారు. 57 మంది ప్రాణాలు కోల్పోయారు.

యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసులు 10 ల‌క్ష‌ల‌కుపైగా న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో 86,305 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.