అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ అనే రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పట్టాదారు పాస్‌బుక్ ఆన్లైన్ చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసిన తహసీల్దార్… రూ.2 లక్షలు గ్రామ రెవెన్యూ అధికారికి ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం తలుపులు వేసి తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
