ఏపీలో 19 వేలు దాటిన క‌రోనా కేసులు.. మొత్తం 8 వేలు దాటిన మ‌ర‌ణాలు

ఏపీలో క‌రోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో 19,412 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

వైర‌స్ బారిన‌ప‌డిన వారిలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 11,18,207కు పెరిగాయి. మ‌ర‌ణాల సంఖ్య 8 వేలు దాటింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 98,214 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.