త‌మిళ‌నాడులో డీఎంకే హ‌వా

త‌మిళ‌నాడులో ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన‌ట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ అంచ‌నా వేశాయి. క‌మ‌ల‌హాస‌న్ నేతృత్వంలోని మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. కోయంబ‌త్తూర్ నుంచి పోటీ చేస్తున్న క‌మ‌ల‌హాస‌న్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరులో ఆధిక్యంలో ఉన్నారు.