తెలంగాణలో కొత్తగా 7,430 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 2,368కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

నిన్న ఒకే రోజు 76,330 కరోనా శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 1,546 నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 533, రంగారెడ్డిలో 475, నల్గొండలో 368, సంగారెడ్డిలో 349, వరంగల్‌ అర్బన్‌లో 321, నిజామాబాద్‌లో 301, మహబూబ్‌నగర్‌లో 279, కరీంనగర్‌లో 272, జగిత్యాలలో 226, సిద్దిపేటలో 242, వికారాబాద్‌లో 203 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.