మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. రైతుల ఆరోపణలు, కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు. నిన్న(శనివారం)నే ఈటలను ఆరోగ్యశాఖ నుండి తొలగించిన విషయం తెలిసిందే.