ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్ట్ ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డిని ఎంపిక చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సమాచార కమిషన్ ఎంపిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. రాష్ట్రంలో ఇకపై వీరిద్దరూ సమాచార హక్కు చట్టం అమలును పర్యవేక్షిస్తారు. ఉల్చాల హరిప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో జర్నలిస్టుగా సేవలు అందించారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ అభ్యసించిన కాకర్ల చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కోర్టుల్లో, ఉమ్మడి హైకోర్టుల్లో గత 15 ఏళ్ళుగా న్యాయవాదిగా సేవలందించారు.