అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యుల పునర్నియామకం

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులు కొనసాగనున్నారు. 2023 ఏప్రిల్ వరకు ఆయన అసెంబ్లీ కార్యదర్శి పదవిలో కొనసాగుతారు.