కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి తొమ్మిది మంది మృతి చెందగా.. సుమారు.. మరో పది మంది వరకు గాయపడ్డారని సమాచారం. ముగ్గు రాయిని వెలికి తీసేందుకు పేలుడు నిర్వహించేందుకు జిలిటెన్ స్టిక్స్ అమర్చుతున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు పేలినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి శరీర భాగాలు తునాతునకలయ్యాయి. చుట్టు పక్కల ఎగిరిపడ్డాయి. దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
