టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్, స‌భ్యుల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బీ జనార్దన్‌ రెడ్డితోపాటు ఏడుగురు సభ్యులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వీరికి టీఎస్‌పీఎస్సీ సిబ్బందితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఖాళీగా ఉన్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవితోపాటు కమిషన్‌ సభ్యుల పదవులను రెండురోజుల క్రితం సీఎం కేసీఆర్‌ భర్తీ చేసిన విషయం తెలిసింది.

వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నసీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జనార్దన్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కారం రవీందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ, రిటైర్డ్‌ ఈఎన్సీ రమావత్‌ ధన్‌ సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్‌ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.