ఏపీలో కొత్త‌గా 20,937 క‌రోనా కేసులు, 104 మంది మృతి

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 20,937 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా కొవిడ్‌-19తో 104 మంది మృతిచెందారు. తాజా కేసుల‌తో కలుపుకుని ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,42,079కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,156గా ఉంది. కొవిడ్‌తో ఇప్ప‌టివ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 9,904కి చేరింది.

గ‌త 24 గంట‌ల్లో జిల్లాల వారీగా కొవిడ్‌తో మృతిచెందిన‌వారి వివ‌రాలిలా ఉన్నాయి. చిత్తూరులో అత్య‌ధికంగా 15 మంది మృతిచెంద‌గా, ప్ర‌కాశం, విజ‌య‌న‌గ‌రంలో 10 మంది చొప్పున‌, తూర్పుగోదావ‌రి, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నంలో 9 మంది చొప్పున‌, అనంత‌పురం, గుంటూరు, క‌ర్నూలు, శ్రీ‌కాకుళంలో ఏడుగురు చొప్పున‌, ప‌శ్చిమ గోదావ‌రిలో ఆరుగురు వ్య‌క్తులు చ‌నిపోయారు.