విశాఖ హెచ్‌పీసీఎల్‌ లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ పాత టెర్మిన‌ల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. సీడీయూ 3వ యూనిట్‌లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శ‌బ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు సైరన్‌ మోగించిన ఉద్యోగులను అందరినీ బయటకు పంపారు. ప్ర‌మాద స్థ‌లంలో ఆరుగురు ఉద్యోగులు, మ‌రికొంద‌రు కార్మికులు ఉన్న‌ట్లు స‌మాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.