ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్‌ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉధృతి దృష్ట్యా పాఠశాలలను తెరిచేందుకు ఆస్కారం లేకపోవడంతో సెలవులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలను తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 13 వేలకుపైగానే పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. 100 మందికిపైగా చనిపోతున్నారు.