ఏపీలో కొత్తగా 8,239 కరోనా పాజిటివ్‌ కేసులు

 గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 61 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,824కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 11,135 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 88 వేల 198 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 96,100  యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,02,39,490  కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.