కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్‌  ఇటీవల వరకు ఎన్‌టీబీవో (నర్మదా తపతి బేసిన్‌ ఆర్గనైజేషన్‌) సీఈవోగా పనిచేయగా.. జూన్‌ 1న ఆయనకు అదనపు కార్యదర్శిగా పదోన్నతి లభించింది. ఎంïపీ సింగ్‌ సర్థార్‌ సరోవర్‌ కన్‌స్ట్రక్షన్‌ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎస్‌సీఏసీ) చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్‌గా పనిచేసిన పరమేశం మే 31న పదవీ విరమణ చేశారు.