జగిత్యాల బల్దియాలో రెవెన్యూ సెక్షన్‌లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ తెలిపారు. బల్దియాలో ఆస్తుల మ్యూటేషన్ కోసం అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ మేరకు శాఖా పరమైన చర్యల్లో భాగంగా ఆర్జేడీ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషన్ తెలిపారు.