శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎన్‌వీ రమణ దంపతులు

భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ దంపతులు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రుకవారం ఉదయం బ‌య‌లుదేరి శ్రీశైలం వెళ్లిన రమణకు మంత్రి వెల్లంపల్లి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ఎన్‌వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీజే దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.