ఏపీలో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 50 మంది చనిపోయారు. కాగా 7,772 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాగా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 17,75,176కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 63,068గా ఉంది.

జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్‌ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో పదకొండు మంది, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్‌, వైఎస్‌ఆర్‌ కడప, కృష్ణ, ప్రకాశంలో ముగ్గురు చొప్పున, కర్నూల్‌, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, నెల్లూరులో ఒక్కరు మరణించారు.