తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది.
