మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి జరుగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ జాబితా:
ప్రకాశ్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనితా చౌదరి, సుధ, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాశ్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేశ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జాన్, సురేశ్ కొండేటి, ఖయ్యూమ్, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్ రావు ఈ ప్యానెల్‌లో ఉన్నారు