జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారుల దాడులు

జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.10,000 లంచం తీసుకుంటూ రైటర్ రమేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అయితే ఎస్సై చెప్తేనే డబ్బులు తీసుకున్నానని రమేష్‌ తెలిపాడు. కాగా, ఎస్సై పృధ్వీ గౌడ్ కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన బాధితుడు ఉప్పరపల్లి నాగరాజు ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నారు. అతని వద్ద రూ.15,000 డిమాండ్ చేయగా పదివేలకు మాట కుదిరింది. నిన్న రాత్రి బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు నాగరాజు ఈ రోజు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.