తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేవరకద్ర పట్టణంలో ఆయన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. విద్యార్థుల్లో మొక్కలు నాటే విషయంపై మరింత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు.