ఏడో విడత హరితహారం ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలోని పెద్దఅంబర్‌పేట కలాన్‌లోని ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్క్‌లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి పాల్గొన్నారు.