ఏసీబీకి చిక్కిన జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ డీఈఈ కృష్ణ

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ కృష్ణ‌.. ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. అసిస్టెంట్ భ‌ర‌త్ కూడా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. డీఈఈ కృష్ణ‌, అసిస్టెంట్ భ‌ర‌త్ నివాసాల్లో ఏసీబీ అధికారులు త‌నిఖీలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.