ఏపీలో కొత్తగా 2,930 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 90,532 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 2,930 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌-19తో 36 మంది చనిపోయారు. కాగా 4,346 మంది కొవిడ్‌ నుండి పూర్తిగా కోలుకున్నారు. జిల్లాల వారీగా తాజాగా సంభవించిన కరోనా మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, గుంటూరు, కర్నూల్‌లో నలుగురు చొప్పున, వైఎస్‌ఆర్‌ కడప, ప్రకాశ, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్‌, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.