తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 7 మంది చనిపోయారు. 1,088 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,26,690కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,964గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,691 మంది చనిపోయారు.