లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మియాపూర్‌ ఎస్‌ఐ

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఓ కేసులో ఎస్‌ఐ లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ట్రాప్‌ చేసిన ఏసీబీ అధికారులు ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌లోనే రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.