తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,146కు చేరగా.. మొత్తం 6,19,344 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 3,738 మంది మృత్యువాతపడ్డారు.