ఏసీబీ వ‌ల‌లో బెల్లంప‌ల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్క‌ర్ రావు

అవినీతికి పాల్ప‌డుతూ మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి టూ టౌన్ పోలీస్ స్టేష‌న్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటుచేసుకుంది. ఇసుక అక్ర‌మ ర‌వాణాలో న‌వీన్ అనే వ్య‌క్తిని ఎస్ఐ భాస్క‌ర్ రావు అరెస్టు చేశాడు. కాగా బెయిల్ ఇవ్వాలంటే రూ.2 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించాడు. ప‌థ‌కం ప్ర‌కారం అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారులు వ‌ల‌ప‌న్నారు. ఎస్ఐ, అత‌ని వాహ‌న డ్రైవ‌ర్ రూ.1.2 ల‌క్ష‌ల‌ను లంచంగా తీసుకుంటుండ‌గా రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న‌ట్లు ఏసీబీ అధికారి కె.భద్ర‌య్య తెలిపారు. భాస్క‌ర్‌ను గురువారం క‌రీంన‌గ‌ర్‌లోని ఏసీబీ ప్ర‌త్యేక కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.