ఫిబ్రవరి 1 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్లెబాట

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశం.