టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్లు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మూడు కోట్ల మొక్కలు నాటడమే కేటీఆర్‌కు పుట్టినరోజు కానుక అని తెలిపారు.