తెలంగాణలో కొత్తగా 638 కరోనా కేసులు, ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 638 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 715 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,41,791కి పెరిగింది. ఇవాళ్టి వరకు 6,28,679 మంది కోలుకున్నారు. ఇంకా 9,325 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,787కు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,14,105 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.